రాహుల్ గాంధీ తో ‘కాలా’ సినిమా డైరెక్టర్‌!

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ ఆసక్తికరమైన వార్తను ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇటీవలే రజనీకాంత్‌తో ‘కాలా’, ‘కబాలి’ చిత్రాలు తెరకెక్కించిన యువదర్శకుడు పా. రంజిత్ రహుల్‌ ని కలిసినట్లు ఈ ట్వీట్‌లో తనే స్వయంగా వెల్లడించారు. బ్లాక్ బస్టర్ మూవీస్ దర్శకుడు పా రంజిత్, యాక్టర్ కలైయారసన్‌తో ఢిల్లీలో భేటీ అయిన సంగతి చెబుతూ వాళ్లతో దిగిన ఫొటోలను రాహుల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అనేక విషయాలు చర్చించామని తెలిపారు.

తమ సంభాషణ చాలా ఆనందభరితంగా సాగిందని. సినిమాలు, రాజకీయలు, సామాజిక అంశాలుతో పాటు పలు విషయాలు చర్చించుకున్నామని. భవష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు రాహుల్‌ వెల్లడించాడు. పా. రంజిత్‌ తన కాలా సినిమాలో సోసైటీకి సంబంధించిన అంశాలపై పలు డైలాగ్స్‌, సన్నివేశాలు జోడించి అందరి దృష్టిని ఆకర్షంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాహుల్‌ ట్వీట్‌కు అతని అభిమానులు అనేకరకాలుగా స్పందిస్తున్నారు. పా. రంజిత్‌తో సినిమా చేస్తారా అంటూ.. రాహుల్‌కు ట్వీట్‌ చేస్తున్నారు.