రిలీజ్ రోజు ఉదయం ఆట ఉచితం

శరత్ చంద్ర, నేహా దేశ్ పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐపిసి సెక్షన్ భార్యాబంధు’ ఈ సినిమాలో ప్రముఖ నటి ఆమని ముఖ్య పాత్రలో నటించారు. రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆలూరి క్రియేషన్స్ పతాకంపై రూపొందింది. ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతోంది. రిలీజ్ సందర్భంగా చిత్రయూనిట్‌ విడుదల రోజు ఉదయం ఆటను అందరికీ ఉచితంగా ప్రదర్శించేందుకు నిర్ణయించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీ ప్లెక్స్ మినహా ఈ చిత్రం విడుదలవుతున్న అన్ని థియేటర్స్ (సింగిల్ స్క్రీన్స్)లో తొలి షోను ఉచితంగా ప్రదర్శించనున్నారు. దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ ఈ విషయాన్ని ప్రకటించారు. సినిమాపై నమ్మకంతో నిర్మాత ఆలూరి సాంబశివరావు ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారని.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పదిమందికి చెబుతారనే నమ్మకంతో ఈ ఆఫర్ ఇస్తున్నామని దర్శకుడు తెలిపాడు.