రూమర్స్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టండి.. తమన్నా

మిల్క్‌ బ్యూటీ తమన్న మీడియాలో తన పెళ్లి పై వస్తున్న పుకార్లపై స్పందించింది. ఒక రోజు యాక్టర్‌ని, మరో రోజు క్రికెటర్‌ని, ఇంకో రోజు డాక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రాస్తున్నారు. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు రాసేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. మీ రాతలు చూస్తుంటే పెళ్లి కొడుకు గురించి షాపింగ్‌ చేస్తున్నట్లు ఉంది అని అంటుంది ఈ ముద్దుగుమ్మ. నా వ్యక్తి గత విషయాలపై ఇలాంటి రాతలు ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెబుతోంది.

నా తల్లిదండ్రులతో నేను చాలా సంతోషంగా ఉన్నాను… నా తల్లిదండ్రులు పెళ్లి కొడుకు కోసం ఇప్పడేమీ వెతకటం లేదు అని తమన్నా తేల్చి చేప్పిసింది. తాను కేవలం సినిమాల్లో మాత్రమే రొమాన్స్‌ చేస్తున్నాను అని తెలిపింది. ఇలాంటి రూమర్స్‌ ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కావడం లేదు. పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాను అని వెల్లడించింది తమన్నా. ఇకనైనా ఇటువంటి బేస్‌లెస్‌ రూమర్స్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని కోరింది మిల్క్ బ్యూటీ తమన్నా.