రూ.10 లక్షలు వెనక్కి ఇచ్చేశారు!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం బెంగళూరులో గురువారం నిర్వహించిన బీఐఎఫ్‌ఎఫ్‌ (బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం) కార్యక్రమంలో లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డ్ అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు ఆయనకు రూ.10లక్షల చెక్కును కూడా బహూకరించారు. కానీ మణిరత్నం అవార్డును తీసుకుని చెక్కును మాత్రం కర్ణాటక చలనచిత్ర అకాడమీకి ఇచ్చేశారు. యువ దర్శకులకు సాయం చేయడానికి ఆ డబ్బు ఉపయోగించాలని అకాడమీని కోరారు. బీఐఎఫ్‌ఎఫ్‌ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న ఏకైక దర్శకుడు మణిరత్నమే కావడం విశేషం.

అవార్డు తీసుకున్న సందర్భంగా మణితర్నం మాట్లాడుతూ..’జీవితసాఫల్య పురస్కారం వచ్చిందని తెలియగానే తీసుకోవాలా వద్దా? అన్న సందిగ్ధంలో ఉన్నాను. ఎందుకంటే ఈ అవార్డు తీసుకుంటే ఇక అన్నీ వదిలేసినట్లే అన్న భావన కలుగుతుంది. కానీ నా స్వగ్రామమైన బెంగళూరు నుంచి అవార్డు అందుకుంటున్నాను కాబట్టి స్వీకరించాను’ అంటూ వెల్లడించారు.