రెండో వివాహం పై స్పందించిన సునీత

ప్రముఖ సింగర్‌ సునీత రెండో వివాహం చేసుకుంటున్నారంటూ..వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆమె సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. ఇతరుల ఇతరుల వ్యక్తిగత విషయాలపై ఎందుకు అంత ఆసక్తి? అని ప్రశ్నించారు. ‘నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానంటూ వార్తలు వెలువడుతున్నాయి. చాలా మంది నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను మళ్లీ పెళ్లిచేసుకుని సెటిల్‌ అవ్వాలని ఎందరో కోరుకుంటున్నారు. నాపై ఎంతో అభిమానం చూపిస్తున్నారు. కానీ మీ అందరికీ ఓ విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పటికైతే అలాంటి ఆలోచనలు లేవు అన్నారు.

కొన్ని వెబ్‌సైట్లు, ఛానెల్స్‌ పదే పదే నా పెళ్లి గురించి ప్రస్తావిస్తున్నాయి. నాకు ప్రైవసీ కావాలి. నా గురించి వస్తున్న వార్తలను నమ్మొద్దు. ఈ విషయంలో సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ నాకు మెసేజ్‌లు వస్తుండడంతో స్పందించాల్సి వస్తోంది. నేను నంది, ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నప్పుడు కూడా ఇన్ని మెసేజ్‌లు రాలేదు. రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలు అనవసరం. నా గురించి ఎవ్వరూ చెడుగా మాట్లాడటం లేదు. అయినప్పటికీ వార్తలు రాయాల్సిన అవసరం లేదు’ అని వెల్లడించారు సునిత.