రెజీనా మరి ఇంత కమర్షియలా..?

రెజీనా మరి ఇంత కమర్షియలా..? 
తెరపై అందంగా, తోటి వారికి సహాయపడుతూ కనిపించే తారలు నిజ జీవితంలో మాత్రం అలా ఉండరు. డబ్బు విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. కొందరు చాటిటబుల్ ట్రస్ట్ లను ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తుంటే కొందరు మాత్రం ఫేమ్ ఉన్నప్పుడే డబ్బు సంపాదించి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని భావిస్తున్నారు. మన హీరోయిన్ రెజీనా కూడా అదే చేస్తోంది. ప్రస్తుతం అమ్మడు కెరీర్ లో మంచి హిట్స్ లేకపోయినా.. అవకాశాలకు మాత్రం కొడవలేదు. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇప్పుడే డబ్బు సంపాదించడానికి సరైన సమయం అనుకుందో ఏమో గాని అడిగినంత డబ్బు ఇవ్వలేదని రీసెంట్ గా జరిగిన మద్రాస్ ఫ్యాషన్ ఓ షోలో ఆఖరి నిమిషంలో ర్యాంప్ వాక్ కు నిరాకరించింది. డిజైనర్ ఎంతగా బ్రతిమిలాడినా.. ఈ భామ మాత్రం కనికరించలేదట. పైగా వేరే డిజైనర్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో అతను డిజైన్ చేసిన దుస్తులతో ర్యాంప్ వాక్ చేసింది. మరీ డబ్బు కోసం ఇంతగా పక్క వాళ్ళను ఇబ్బంది పెట్టిన రెజీనాను చూసి అందరూ ఆశ్చర్యపోయారట. డబ్బు ముఖ్యమే కానీ అన్ని సార్లు అదే పనికిరాదు.. ఈ విషయాన్ని రెజీనా ఎప్పుడు తెలుసుకుంటుందో!
CLICK HERE!! For the aha Latest Updates