రేణు దేశాయ్‌ నిశ్చితార్థపు…వైరల్‌

నటి, పవన్‌ మాజీ భార్య అయిన రేణూ దేశాయ్‌ తన జీవితానికి సంబంధించిన ఫొటోను షేర్‌ చేయగా ఆ ఫొటో వైరల్‌ అవుతోంది. ఆ మధ్య రెండో వివాహం గురించి మాట్లాడిన ఆమె.. తాజాగా ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపారు. తనకు కాబోయే జీవిత భాగస్వామి చేతిపై రేణూ చెయ్యేసిన ఫొటోను షేర్‌ చేశారు. ఆ ఫొటోలోనిశ్చితార్థపు ఉంగరాలు గమనించవచ్చు. జీవిత భాగస్వామి ఎవరు, ఏంటి అన్న వివరాలపై స్పష్టత ఇ‍వ్వకపోయినా.. ఎంగేజ్‌ మెంట్‌ జరిగిన విషయాన్ని మాత్రం తన పోస్ట్‌తో తెలియజేశారు

‘జీవిత భాగస్వామి కోసం వెతికితే తప్పేంటి. పిల్లల్ని చూసుకోవడానికి నాకు ఓ తోడు అవసరం’ అని పేర్కొన్న రేణూ ‌.. ఇటీవల తన రెండో వివాహ ఆలోచనలను షేర్‌ చేసుకున్నారు. ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫొటోను ఓ కవితతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్‌ చేశారు. కాగా, విడాకుల అనంతరం పవన్‌ కల్యాణ్‌ మరో వివాహం చేసుకోగా, రేణు మాత్రం పిల్లలు అకీరా నందన్‌, ఆద్యలతో కలిసి పూణేలో నివసిస్తున్నారు. కొన్ని రోజులుగా అకీరా తండ్రి పవన్‌తో కలిసి విజయవాడలో ఉంటున్నాడని ఇటీవల రేణు తెలిపారు.

పవన్‌ మేల్‌ ఫ్యాన్స్ నుంచి తనకు ఎక్కువగా అభినందనలతో పాటు సహకారం అందడంపై రేణు హర్షం వ్యక్తం చేశారు. అందమైన, మనసున్న మిమ్మల్ని పవన్‌ ఎందుకు వదులుకున్నారో అర్థం కావడం లేదని అభిమానులు ఆమెకు మెస్సేజ్‌లు చేశారు. తనకు మద్దతు తెలిపిన అందరికీ నటి ధన్యవాదాలు తెలుపుతూ మరో పోస్ట్‌ చేశారు.