రేణు దేశాయ్‌.. రీ ఎంట్రీ!

రేణు దేశాయ్‌ పవన్‌ కళ్యాణ్ తో అఫీషియల్‌గా విడాకులు తీసుకున్న అనంతరం పుణేలో ఉంటూ.. చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తుంది. రేణు, పవన్‌ తో కలిసి .. బద్రి, జానీ వంటి చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాల తరువాత ఈమె సినిమాలకు దూరంగా ఉంది. పవన్‌ కాస్ట్యూమ్ వ్యవహారాలు కొంతకాలం చూసుకుంది. పవన్‌తో విడిపోయిన తరువాత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి రేణు దేశాయ్‌ సిద్దమైంది.

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న రేణు ఇప్పడు తిరిగి సినిమాల్లోకి రానుందట. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు..పెళ్ళికి ముందా లేక పెళ్ళి తరువాత అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఒకవైపు రేణు చిన్న చిన్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూనే బుల్లితెర పై రియాలిటీ షోలలో జడ్డిగా కూడా వ్యవహరిస్తుంది.