లండన్‌ మ్యూజియంలో మరో బొమ్మ

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికి పదుకొనేకు ఈ సంవత్సరం ల్యాండ్ మార్క్ ఇయర్ కానుంది. ఈ ఏడాది ఆమె జీవితంలో మూడు ముఖ్యమైన ఘట్టాలకు వేదిక కానుంది. దీపిక పదుకొనేకు అరుదైన గౌరవం దక్కింది. త్వరలో ఆమె మైనపు విగ్రహాన్ని లండన్‌లోని మ్యూజియంలో పెట్టనున్నారు. ఆమె నటించిన ‘పద్మావత్’ సూపర్ డూపర్ హిట్ అయింది. సూపర్‌స్టార్ రణ్‌వీర్‌సింగ్‌తో సుదీర్ఘకాలంగా నడుస్తున్న ప్రేమాయణానికి ఈ ఏడాది డిసెంబరుతో పుల్‌స్టాప్ పడనుంది. త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన ప్రకటన వెలువడనుంది.

అతి త్వరలో లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో దీపిక మైనపు విగ్రహం కొలువుదీరనుంది. దీనికి సంబంధించి మ్యూజియం ప్రతినిధులు తన కొలతలు తీసుకుంటున్న ఫొటోలను దీపిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇప్పుడా ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. లండన్‌లో దీపికను కలిశామని, ఆమె మైనపు విగ్రహం కోసం 200కు పైగా కొలతలు, ఫొటోలు తీసుకున్నట్టు టుస్సాడ్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

CLICK HERE!! For the aha Latest Updates