లంబార్టి లో దీపికా, రణ్‌వీర్‌ వివాహం

బాలీవుడ్ నటి దీపికా పదుకొనె,రణ్‌వీర్‌ సింగ్ జంట గత కొంత కాలంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు చాలా కాలంగా డేటింగ్‌ లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, వీరి వివాహం గురించి మాత్రం ఈ ఇద్దరు నోరు మెదపడం లేదు. పైగా ఈ న్యూస్‌ను ఖండించడం లేదు. దీంతో ఇద్దరి వివాహం ఖాయం అయినట్టు బాలీవుడ్‌ కోడై కూస్తుంది.

బాలీవుడ్‌ పత్రికలు మరో అడుగు ముందుకు వేసి.. నవంబరు 10న ఈ జంట వివాహం చేసుకోబోతున్నట్టు పేర్కొన్నాయి. అనుష్క శర్మ, విరాట్‌ వివాహం మాదిరిగానే వీరు కూడా ఇటలీలో వివాహం చేసుకోబోతున్నారట. ఇటలీలోని లంబార్టి ప్రదేశంలోని కొమో సరస్సు ఒడ్డున ఉన్న రిసార్ట్ లో ఈ అందాల జంట వివాహం జరగబోతుంది అని సమాచారం.