‘లవర్‌’ మూవీ ట్రైలర్‌

యువ హీరో రాజ్‌ తరుణ్, రిధి కుమార్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవర్’‌. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలతో రాజ్‌తరుణ్ న్యూ లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు అన్నిష్‌ కృష్ణ దర్శకత్వం వహించగా దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 20 వ తేదీ న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ రోజు సాయంత్రం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో నేను రాజ్‌ అని రాజ్‌ తరుణ్‌ డైలాగ్‌తో మొదలౌతుంది. హీరోయిన్‌ తమిళ నర్స్‌ గా కనిపిస్తుంది. రాజ్‌ తరుణ్‌ ప్రేమికుడిగా, ప్రియరాలిని దక్కించుకునేందుకు చేసే యాక్షన్‌ సీన్స్‌తో ఈ ట్రైలర్‌ అందర్ని ఆకట్టుకనేలా ఉంది.