లవర్‌ మూవీ రివ్యూ

movie-poster
Release Date
July 20, 2018

సినిమా : లవర్‌
నటీనటులు : రాజ్‌ తరుణ్‌, రిద్ధి కుమార్‌, రాజీవ్ కనకాల, శరత్‌ కేడ్కర్‌, అజయ్‌
దర్శకత్వం : అనీష్‌ కృష్ణ
నిర్మాతలు : దిల్‌ రాజు
సంగీతం : సాయి కార్తీక్‌, అంకిత్‌ తివారి, అర్కో ప్రావో ముఖర్జీ, రిషీ రిచ్‌, అజయ్‌ వాస్‌, తనిష్క్ బాగ్చీ

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరో రాజ్‌ తరుణ్‌ తరువాత గాడి తప్పాడు. వరుస ప్లాప్‌లోతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్నాడు. రొటీన్‌ సినిమాలతో ప్రేక్షకులను విసిగించిన రాజ్‌ తరుణ్‌ తాజాగా లవర్‌ ఉంటూ.. ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్నికి అనీష్‌ కృష్ణ దర్శకుడు. ట్రైలర్‌తో రాజ్‌ తరుణ్‌ను యాక్షన్‌ హీరోగా పరిచయం చేసే ప్రయత్నం చేసిన మేకర్స్‌.. లవర్‌తో రాజ్‌ తరుణ్ కమర్షియల్‌ హీరోగా నిలబెట్టారా..? వరుస ఫ్లాప్‌లతో ఉన్న ఈ యంగ్‌ హీరో సక్సస్‌ ట్రాక్‌లోకి వస్తాడా..?

కథ: హీరో రాజు (రాజ్‌ తరుణ్‌) ఓ అనాథ. అనంతపురంలో ఓ కంపెనీలో మోటర్‌ బైక్‌ బిల్డర్‌గా పనిచేస్తుంటాడు. జగ్గు (రాజీవ్‌ కనకాల)ను తన సొంత అన్నగా భావిస్తూ.. వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంటాడు. ప్రెండ్స్‌ తో కలిసి హ్యాపిగా లైఫ్ ఎంజాయ్‌ చేస్తున్న రాజుకు ఓ గొడవ కారణంగా గవర్నమెంట్‌ హాస్పట్‌లో నర్సుగా పనిచేస్తూన్న చరిత (రిద్ది కుమార్‌) పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. తాను చూసే హాస్పిటల్‌లో ఏ చిన్న తప్పు జరిగిన ఎదిరించే చరిత, లక్ష్మీ అనే అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణల మీదకు తెచ్చుకుంటుంది. చరిత కాపాడాలనుకున్న ఈ లక్ష్మీ అనే అమ్మాయి ఎవరు..? ప్రభుత్వాన్నే వణికించే వరదరాజులు (శరత్‌ కేడ్కర్‌)కు ఆ అమ్మాయికి సంబంధం ఏంటి? లక్ష్మీ, చరితలను రాజు ఎలా కాపాడతాడు..? అనేదే ఈ కథలోని అంశం.

నటీనటులు : ఇప్పటీ వరుకూ..లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ ఉన్న చిత్రాలను చేస్తూ..ఆకట్టుకున్న రాజ్‌ తరుణ్.. లవర్‌ సినిమాతో మాస్‌ హీరోగా కనిపించే ప్రయత్నం చేశాడు. యాక్షన్‌ హీరోగా ఫ్రూవ్‌ చేసుకునేందుకు కష్టపడ్డాడు. హీరోయిన్‌ రిద్ది కుమార్‌కు తొలి చిత్రమైన నటనకు ఆస్కారం ఉన్న పాత్రే దక్కింది. తెర మీద అందంగా కనిపించింది. అన్యాయాన్ని ఎదిరించే పాత్రలో చరిత పాత్రలో రిద్ది కుమార్‌ మంచి నటన కనబరిచింది. రాజీవ్‌ కనకాల నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. చాలా రోజుల తరువాత ఫుల్‌ లెంగ్త్‌ ఉన్న రోల్‌లో కనిపించిన రాజీవ్‌ తనదైన ఎమోషనల్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. విలన్స్‌ గా అజయ్‌, సుబ్బరాజలు పాత్ర రొటీన్‌గానే ఉంది. మెయిన్‌ విలన్‌గా నటించిన శరత్‌ కేడ్కర్‌ది అతిధి పాత్రే. ఆయన తెర మీద కనిపించేది కేవలం రెండు మూడు సన్నీవేశాల్లోనే. హీరో ఫ్రెండ్‌గా సత్యం రాజేష, ప్రవీణ్‌, సత్య, రాజాలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ: నాలుగు సంవత్సరాలు విరామం తరువాత అనీష్‌ కృష్ణ దర్శకుడిగా చేసిన సినిమా లవర్‌ రొటీన్‌ ప్రేమ కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్కడక్కడా కాస్త కొత్తదానం కనిపించినా ఎక్కువ భాగం రొటీన్‌ ప్రేమకథలాగే సాగింది. ఫస్ట్‌ హాఫ్‌ను కామెడీ, లవ్‌ స్టోరితో నడిపించిన దర్శకుడు అసలు కథ మొదలు పెట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. కామెడీ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం కాస్త నిరాశపరుస్తుంది. క్లెమాక్స్‌ కూడా ఆసక్తికరంగ లేదు. క్లెమాక్స్‌ ముందు వరుకు బాగానే ఉన్నా.. క్లెమాక్స్‌ను హడావిడిగా ముగించేసిన భావన కలుగుతుంది. కార్‌ను హ్యాక్‌ చేయటం లాంటి అంశాలు ప్రేక్షకులకు అర్థం కావటం కాస్త కష్టమే. సంగీతం బాగుంది. ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు పనిచేయటం కొత్త ప్రయోగమనని చెప్పాలి. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫి మరో ప్లస్‌ పాయింట్‌. ఇంటర్‌వెల్‌ కు ముందు వచ్చే యాక్షన్‌ సీన్స్‌తో పాటు కేరళలో జరిగే సీన్స్‌లో కెమెరా వర్క్‌ ఆకట్టుకునే విధంగా వుంది. ఎడిటింగ్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
రాజ్‌ తరుణ్‌, రిద్ది కుమార్‌ నటన
సాంగ్స్‌

మైనస్‌ పాయింట్స్‌ ;
రొటీన్‌ కథా కథనాలు

చివరిగా :’లవర్’ రొటీన్‌ ప్రేమ కథే
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Critics METER

Average Critics Rating: 3
Total Critics:3

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

'లవర్' రొటీన్‌ ప్రేమ కథే
Rating: 2.5/5

https://www.klapboardpost.com

లవర్.. కొత్తగా ఏమీ లేడు
Rating: 2.5/5

http://www.tupaki.com

ఏదో..అలా..అలా
Rating: 2.75/5

https://www.telugu360.com