‘లవర్’ డేట్ ఫైనల్ చేశాడు!

యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ సంక్రాంతికి ‘రంగుల‌రాట్నం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. త్వరలోనే ‘రాజుగాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ హీరో. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న ‘లవర్’ సినిమాలో నటిస్తున్నాడు రాజ్ తరుణ్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు దిల్ రాజు. ‘అలా ఎలా?’ వంటి సూప‌ర్ హిట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు అనీశ్ కృష్ణ‌ ఈ సినిమాకు దర్సకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ఈ సినిమా ప్రేమ‌లోకి కొత్త కోణాల‌ను ట‌చ్ చేసేలా తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం ద్వారా రిద్ది కుమార్ హీరోయిన్‌గా ప‌రిచయం చేస్తున్నారు. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న ఈ సినిమాను జూన్ 14న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత దిల్‌రాజు స‌న్నాహాలు చేస్తున్నారు.