‘లైఫ్‌ ఈజ్‌ ఆన్‌’ స్లోగన్‌తో సమంత

సమంత అక్కినేని పెళ్ళి అనంతరం కూడా సినిమాలతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్‌ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సమంత వినికిడి లోపంతో బాధపడుతున్న పదిమంది చిన్నారులకు వినికిడి యంత్రాలు అందించారు.వినికిడిలోపం గుర్తించే ఉచిత శిబిరాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

సమంత పొనాక్‌ అనే సంస్థను ఈ రోజు (శుక్రవారం) సందర్శించారు. ‘లైఫ్‌ ఈజ్‌ ఆన్‌’ అనే స్లోగన్‌తో.. వినికిడి లోపం ఉన్న పిల్లలకు సహాయం అందించేందుకు కృషి చేస్తోందీ సంస్థ. వినికిడి లోపం గుర్తించే శిబిరాలను నిర్వహిస్తున్నారు. సమంత చేతుల మీదుగా ఓ పదిమంది చిన్నారులకు వినికిడి యంత్రాలను అందించారు. పొనాక్‌ సంస్థకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని సమంత అన్నారు. ప్రస్తుతం యూటర్న్‌ చిత్రం సమంత చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి.