వచ్చేనెలలో వచ్చేస్తున్న సవ్యసాచి

నాగచైతన్య హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతున్న ‘సవ్యసాచి’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ సినిమాలో మాధవన్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చేనెల ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన రషెష్‌ను నాగార్జున చూసి చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారట. దీంతో సవ్యసాచి చిత్రబృందం సంతోషంలో మునిగిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయమని చెబుతున్నారు. నాగచైతన్య కెరీర్‌లోనే ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలవబోతుందని చెప్పారట.