వరుణ్ ‘అహం బ్రహ్మస్మి’!

మెగాహీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఫిదా, తొలిప్రేమ అంటూ వరుస విజయాలను అందుకున్నాడు. ఇదే జోష్ లో తన తదుపరి సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ‘ఘాజీ’ చిత్రదర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. స్పేస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగనుందని సమాచారం. ఈ సినిమాలో ఆస్ట్రోనాట్ గా కనిపించబోతున్నాడు వరుణ్.
తాజాగా ఈ సినిమాకు టైటిల్ గా ‘అహం బ్రహ్మస్మి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఈ టైటిల్ ను అనౌన్స్ చేయనప్పటికీ ఇదే టైటిల్ ను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు వరుణ్ దాదాపు రూ.4 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం.  ప్రస్తుతం పాత్రకు తగ్గట్లుగా తనను మలుచుకోవడానికి సిద్ధమవుతున్నాడు.