వరుణ్ లిస్ట్ లో ఇద్దరు దర్శకులు!

రీసెంట్ గా తొలి ప్రేమ చిత్రంతో హిట్ కొట్టిన వరుణ్ తేజ్ తాజాగా రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. సంకల్ప్ దర్శకత్వంలో స్పేస్ సినిమా ఒకటి సాగర్ చంద్ర సినిమా మరొకటి. సంకల్ప్ సినిమా అందరికి తెలుసు. తాజాగా వరుణ్ తేజ్ డైరెక్టర్ సాగర్ చంద్ర సబ్జెక్టు ను ఓకే చేసాడు. 14 రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. స్క్రిప్ట్ ఫైనల్ అయిన ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. సాగర్ చంద్ర గతంలో ‘అయ్యారే’ , ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలకు దర్శకత్వం వహించాడు.
 మూడో సినిమా వరుణ్ తేజ్ తో చేయడం విశేషం. ప్రస్తుతం వరుణ్.. సంకల్ప్ సినిమా కోసం తన శరీర బరువును తగ్గించే పనిలో పడ్డాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా పూర్తయిన తరువాత సాగర్ చంద్ర సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు.