వరుస చిత్రాలతో దేవరకొండ బిజీ

యంగ్ హీరో విజయ్ దేవరకొండ అర్జున్‌ రెడ్డి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రం తరువాత వరుసగా సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఇప్పటికే మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో మూడు మూవీలో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

 

‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై దర్శకుడు క్రాంతిమాధవ్ నిర్మించగా ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అలాంటి ఈ కాంబినేషన్లోనే మరో ప్రాజెక్టు సిద్ధం కాబోతోంది. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండను తీసుకున్నారట. ప్రస్తుతం ఈ చిత్రంలో కథనాయిక కోసం అన్వేషిస్తున్నారట. ఈ సినిమాలో దేవరకొండ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడట.