వర్మ ఎదుట పది ప్రశ్నలు!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘జీఎస్టీ’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల సమయంలో వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా ఆయనపై మహిళా సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు పోలీసుల ముందు హాజరైన వర్మకు ఎదురైన ప్రశ్నలు ఇవే..
1.జీఎస్టీ లాంటి సినిమాను ఎందుకు తీశారు..?
2.మియా మాల్కొవాతో అడల్ట్ సన్నివేశాలు ఎలాంటి చిత్రీకరించారు..?
3.ఐటి యాక్ట్ ప్రకారం మహిళలను అసభ్యంగా చూపించడం తప్పని మీకు తెలియదా..?
4.సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసిన మాల్కొవా ఫోటోలు ఎక్కడివి..?
5.టీవీ షోలో విశాఖపట్టణంకు చెందిన మహిళ(దేవి) మీద మీరు చేసిన కామెంట్స్ అసభ్యకరమా..? కాదా..?
6.దేవితో మీరు పోర్న్ సినిమా చేస్తాననడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు..?
7.జీఎస్టీకు భారతీయ చట్టం వర్తించదని చెప్పడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా..?
8.అమెరికాలో జీఎస్టీ ఎలా తీశారు..?
9.సినిమాను ఎవరు నిర్మించారు..?
10.విమియో వెబ్ సైట్ కు సినిమాను ఇంతకు అమ్మారు..?