వర్మ తన సినిమాను అమ్మేశాడు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన చిత్రం ‘భైరవగీత’. సిద్దార్థ తాతోలు అనే కొత్త దర్శకుడు నిర్మించిన ఈ చిత్రం అన్ని పనుల్ని పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ముందుగా సినిమాను తానే స్వయనా విడుదల చేయాలని అనుకున్న వర్మ అభిషేక్ పిక్చర్స్ నుండి మంచి ఆఫర్ రావడంతో ఈ సినిమాను అమ్మేశారు.

‘భైరవగీత’ చిత్రాన్ని సొంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్ భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేయనుంది. అంతకంటే ముందు సెప్టెంబర్‌ 1వ తేదీన (రేపు) ఈ మూవీ ట్రైలర్ ను విడుదలచేస్తున్నారు. ధనంజయ, ఇర్రా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ ప్రేమకథా చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించారు.