వర్మ సినిమా కోసం నాగ్ కష్టాలు!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వర్మ సినిమాలలో యాక్షన్ ఎంత రియలిస్టిక్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాక్షన్ ఎపిసోడ్ల పై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటాడు ఈ దర్శకుడు. ముంబైలో యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసిన వర్మ హీరో నాగార్జునను వీధుల్లో పరుగులు పెట్టిస్తున్నాడట.
నాజర్, అజయ్ లు కూడా షూటింగ్ స్పాట్ లో ఉన్నారని సమాచారం. వీరందరిపై ఛేజింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నిజానికి ఇటువంటి సీన్స్ లో డూప్స్ ను పెట్టి కవర్ చేయొచ్చు కానీ వర్మ మాత్రం దానికి ససేమేర అన్నట్లు తెలుస్తోంది. నాగార్జున ఈ విధంగా సెట్ లో శ్రమించి చాలా కాలమైంది. దీంతో అతడికి అవస్థలు తప్పడంలేదని సమాచారం. కానీ దర్శకుడు చెప్పినట్లు చేయాలి కాబట్టి ఏం అనలేకపోతున్నాడట