వాళ్ల దెబ్బకు మా ఎమ్మెల్యే పోటీ చేయలేకపోతున్నాడు!

డేటా వార్.. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతోంది. టీడీపీ సేవా మిత్రా యాప్ రూపొందించి నిర్వహిస్తున్న ‘ఐటీ గ్రిడ్స్’ సంస్థ అక్రమంగా ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను కలిగి ఉన్నదని ప్రతిపక్ష వైసీపీ ఫిర్యాదు చేయడం.. దానిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించి విచారించడంతో పక్కనున్న ఏపీలో కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వంతో సై అంటే సై అంటోంది.

ఐటీ గ్రిడ్స్ మూలాలు తవ్వితే టీడీపీ బండారం బయటపడుతుందోనన్న అనుమానాలకు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు బలాన్ని ఇస్తోంది. టీడీపీ నేతలు, చంద్రబాబు అదే పనిగా దీనిపై ఉలికి పడుతున్న తీరు చూస్తే అదే అనిపిస్తోంది.

తాజాగా నిన్న చంద్రబాబు డేటా చోరీ స్పందించారు. ఈ సందర్భంగా బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ఐటీ గ్రిడ్స్ విషయంలో తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. ‘సీబీఐ వాళ్ల దెబ్బకు మా ఎమ్మెల్యే పోటీ చేయలేకపోతున్నాడు’ అని చంద్రబాబు అనడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఆ ఎమ్మెల్యే ఎవరనే చర్చ ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఎమ్మెల్యే పేరు చెప్పకపోవడంతో ఎవరికి వారు అన్వయించుకుంటున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరు.. ? ఏం చేశాడు.? సీబీఐ ఎందుకు అతన్ని వెంట పడుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఐటీ గ్రిడ్స్ తో పాటు కేంద్రంలోని బీజేపీ వేసిన స్కెచ్ తో పాపం బాబు అండ్ బ్యాచ్ విలవిల లాడుతున్నట్టే కనిపిస్తోంది.