విక్రమ్ కు ఆ హీరోను డైరెక్ట్ చేయాలనుందట!

విక్రమ్ కు ఆ హీరోను డైరెక్ట్ చేయాలనుందట!
ఇండస్ట్రీలో అడుగుపెట్టి సుమారుగా పాతిక ఏళ్ళు గడుస్తున్నా.. ఇప్పటికీ స్టార్ హీరోగా వెలుగొందుతోన్న 
నటుడు విక్రమ్. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుండే చియాన్ త్వరలోనే ఓ సినిమాను 
డైరెక్ట్ చేయడానికి సిద్ధపడుతున్నాడట. రీసెంట్ గా చెన్నై లో వచ్చిన వరదల నేపధ్యంలో ఓ షార్ట్ 
ఫిల్మ్ ను రూపొందించిన విక్రమ్ పూర్తి స్థాయి సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. దానికోసం 
ఇప్పటినుండే 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకో విషయమేమిటంటే  తను డైరెక్ట్ చేయబోయే సినిమాలో హీరోగా విక్రమ్ చేయడంట. మీకెవరిని డైరెక్ట్ చేయాలనుందని 
ప్రశ్నించగా తడుముకోకుండా విజయ్ అని సమాధానం చెప్పారు. మరి విక్రమ్ కోరికను విజయ్ 
తీరుస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటించిన ‘ఇంకొక్కడు’ సినిమా సెప్టెంబర్ మొదటి 
వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్రమ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. 
CLICK HERE!! For the aha Latest Updates