విజయవాడలో నారా రోహిత్‌ పుట్టిన రోజు వేడుకలు

నారా రోహిత్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు (బుధవారం) వేడుకలను ఆయన అభిమానులు విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర ఉన్న తాడేపల్లిలో చిగురు చిల్డ్రన్‌ హోమ్‌ వద్ద నారా రోహిత్‌ అభిమాన సంఘం అధ్యక్షుడు వీరపనేని శివ ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు పండ్లు, పుస్తకాలు, పెన్సిళ్లు పంపిణీ చేయడం జరిగింది. మధ్యాహ్నం అనాధపిల్లలకు అన్నదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రముఖ పారిశ్రామిక వేత్త అట్లూరి నారాయణరావు, తాటికొండ సాయి కృష్ణ పాల్గొన్నారు. అనంతరం వీరపనేని శివ మాట్లాడుతూ.. “నా ఆధ్వర్యంలో నారా రోహిత్‌ గారి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది. సేవా కార్యక్రమాలు చేయడంలో నారా రోహిత్‌ అభిమానులు ఎప్పుడూ ముందుంటారు” అని అన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ..”అభిమానుల సమక్షంలో జరుగుతున్న నారా రోహిత్‌ జన్మదిన వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.. అలాగే ఆయన తదుపరి చిత్రం నేను నిర్మించడం చాలా గర్వంగా ఉంది” అన్నారు.