విజయ్‌ దేవరకొండతో మారుతి‌..!

టాలీవుడ్ లో సెన్సేషనల్‌ స్టార్‌గా ఎదుగుతున్న హీరో విజయ్‌ దేవరకొండ తో దర్శకుడు మారుతి ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారట. కామెడీ చిత్రాల స్పెషలిస్ట్‌ మారుతి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శైలజా రెడ్డి అల్లుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 13న రిలీజ్‌ అవుతోంది. దర్శకుడు మారుతి శైలజా రెడ్డి అల్లుడు తరువాత యువీ క్రియేషన్స్ తో సినిమా చేయాలని అనుకుంటున్నారట.

ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. గీత గోవిందం సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చేరిన విజయ్‌ ప్రస్తుతం టాక్సీవాలా, నోటా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తరువాత డియర్‌ కామ్రేడ్‌ సినిమా చేయాల్సి ఉంది. అంటే మారుతి దర్శకత్వంలో సినిమా ప్రారంభం కావాలంటే ఇంకాస్త టైం పట్టే అవకాశం ఉంది.