విజేత సక్సెస్ మీట్‌

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ హీరోగా రాకేష్‌ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మించిన సినిమా విజేత. రజని కొర్రపాటి నార్మాతగా హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం జులై 12న విడుదలై మంచి కలెక్షన్స్‌ తో దూసుకుళుండటంతో ఈ రోజు (ఆదివారం) విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ… కల్యాణ్‌ ‘మా అల్లుడు గారు’ అని సంభోదిస్తూ… మా మామయ్యకు అల్లుడు అయినా మా ఫ్యామిలీ మొత్తానికి ఆయన చాలా క్లోజ్‌.. కల్యాణ్‌ మాకు చాలా స్పెషల్‌ అని అన్నారు.

కల్యాణ్ నాకు క్లోజ్‌ కావడం తో తన ఫస్ట్‌ సినిమా ఎలా చేస్తాడో అనే చిన్న భయం ఉండేది. కల్యాణ్ ని బాగా గమనించాను కానీ సినిమా చూసేకొద్ది కల్యాణ్‌ ను చూడటం మానేశాను. నాకు క్యారెక్టరే కనిపించింది. తొలి సినిమా అయినా బాగా చేశాడు. ఈ చిత్రంలో మురళీ శర్మ గారు చాలా బాగా నటించారు. అతన్ని అతిథి సినిమా నుంచి గమనిస్తున్నాను. చాలా బాగా యాక్ట్‌ చేస్తారు. క్లెమాక్స్‌ చాలా బాగుంది. ట్విస్ట్‌ చాలా నచ్చింది అని బన్నీ వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, మురళీ శర్మ, దర్శకుడు రాకేష్ శశి, నిర్మాత తదితరులు పాల్గొన్నారు