HomeTelugu Big Storiesవిడుదలకు సిద్ధంగా 'లంక'!

విడుదలకు సిద్ధంగా ‘లంక’!

సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘లంక’. శ్రీముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నామన శంకర్రావు-సుందరిలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు మాట్లాడుతూ.. “వైవిధ్యమైన కథాంశంతో సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ఇది. టెలీపతి నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు విశేషమైన స్పందన వచ్చింది. అలాగే ఈ చిత్రంలో మరో కథానాయికగా నటిస్తున్న ఐనా సాహాపై చిత్రీకరించిన పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ‘లంక’ తప్పకుండా సూపర్ హిట్ అవుతుందన్నా నమ్మకం ఉంది” అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu