విడుదలకు సిద్ధమవుతున్న ‘వర్మ vs శర్మ’

విడుదలకు సిద్ధమవుతున్న ‘వర్మ vs శర్మ’ 

మాస్టర్ నార్ని చంద్రాంషువు  సమర్పణలో  పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై  బాబ్ రతన్, బిందు బార్బీ జంటగా నటించిన  చిత్రం వర్మ vs శర్మ. బి.భువన విజయ్ దర్శకత్వంలో కామెడీ సెటైర్ గా రూపొందిన ఈ చిత్రంలో గిరిబాబు, జూ.రేలంగి టైటిల్ రోల్స్ పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు చివరిదశలో ఉన్నాయి. ఈ సందర్భంగా..

దర్శకుడు బి.భువన విజయ్ మాట్లాడుతూ… ”వర్మ,శర్మ పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్  టైటిల్ కు తగ్గట్లే సరదాగా ఉంటుంది. ముఖ్యంగా వారిద్దరి మధ్య టివి లో వచ్చే డిబేట్స్ అందరినీ నవ్విస్తాయి. అలాగే చక్కని మెలోడీ పాటలకు తగ్గ లొకేషన్స్ కూడా కుదిరాయి. ప్రస్తుత ట్రెండ్ కు, కమర్షియాలిటీకి ఏమాత్రం తగ్గకుండా కథనం కొనసాగుతుందని” అన్నారు.

నిర్మాత ఫణి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ…”గతంలో బి.భువన్ విజయ్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి తనకు ఈ అవకాశం ఇచ్చానని,  దర్శకుడు ఫీల్ గుడ్ మరియు హ్యూమర్ తో కూడిన చక్కని కథను రూపొందించాడని” అన్నారు.   ”చిత్ర పరిశ్రమకు తాను క్రొత్త అయినప్పటికీ, ట్రెండ్ కి తగ్గట్లు పూర్తి స్థాయి హాస్య భరిత  చిత్రాన్ని నిర్మించినందుకు సంతోషంగా ఉందని” అన్నారు.  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరిదశలో ఉన్నాయి. సెప్టెంబర్ ద్వితీయార్ధంలో ఆడియో విడుదల చేసి తదుపరి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని” తెలిపారు.

గిరిబాబు, జూ.రేలంగి, బాబ్ రతన్, బిందు బార్బీ, దీక్షితులు, రమణ సూరంపూడి, అడ్డకర్ల, బాబులు, గాంధీ, ఉదయబాబు,నరసింహమూర్తి, తిరుపతి రావు, అజయ్, శ్రీరామ్, వాసు, బుల్లబ్బాయి, భారతి, లలిత,మౌనిక,లక్ష్మి తదితరులు నటించిన ఈ చిత్రానికి  సంగీతం:రమణ రాథోడ్, కెమెరా: జి.రంగ, ఎడిటింగ్: ప్రభు, పాటలు: రమణ్ లోక్, కొరియోగ్రఫీ: బ్రో.ఆనంద్, ఆర్ట్: హరి,  నిర్మాత: నార్ని ఫణి దుర్గా ప్రసాద్(చినబాబు), రచన-దర్శకత్వం: బి.భువన విజయ్.

varma vs sharma ws (9)
CLICK HERE!! For the aha Latest Updates