వినాయక్ కు ఛాన్స్ ఇచ్చేదెవరు!

‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వినాయక్ కొంత గ్యాప్ తరువాత ‘ఇంటెలిజెంట్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా తనతో చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించాడు తేజు. కానీ విడుదలైన తరువాత పరిస్థితి దారుణంగా మారింది. తేజు కెరీర్ లోనే అట్టర్ ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. వినాయక్ ఇంకా పాత పద్ధతిని ఫాలో అవుతూ చేసిన ఈ సినిమా ఆడియన్స్ ను నిరాస పరిచింది. మరి ఈ సినిమా తరువాత వినాయక్ తో కలిసి పని చేయడానికి ఏ స్టార్ ముందుకొస్తాడు అనేది ప్రశ్నగా మారింది.
ఒకప్పుడు వినాయక్ మార్క్ సినిమాలు బాగా ఆడేవి. కానీ గతకోన్నేల్లుగా ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఇప్పుడంతా కూడా కొత్త కథ, కథనాలపై దృష్టి పెడుతున్నారు. స్టార్ హీరోలు కూడా రొటీన్ సినిమాలకు గుడ్ బై చెప్పి కొత్తగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకముందు వినాయక్ అంటే కథ కూడా అడగకుండా ఓకే చెప్పేసే ఎన్టీఆర్ సైతం ఇప్పుడు ఆయనతో సినిమా చేయని పరిస్థితి. మరి ఈ క్రమంలో వినాయక్ కు ఏ హీరో అయినా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి!
2 Attachments