‘వీర భోగ వసంత రాయలు’ నారా రోహిత్‌ ఫస్ట్‌ లుక్‌

డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. ఈ చిత్రంలో నారా రోహిత్‌ ప్రధాన పాత్రలో నటించగా సుధీర్‌ బాబు, శ్రీవిష్టు, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని శ్రియ లుక్‌ను చిత్రయూనిట్‌ రివీల్‌ చేసింది. నారా రోహిత్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి అతడి లుక్‌ను రివీల్‌ చేశారు. గతకొద్ది రోజులుగా ఈ సినిమాలో రోహిత్‌ దివ్యాంగుడిగా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అలాంటి రూమర్స్‌ను కొట్టిపారేస్తూ ఈ లుక్‌ ను రివీల్‌
చేశారు చిత్రయూనిట్‌.

పోస్టర్లో ‘హిట్ మ్యాన్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నారా రోహిత్ ని పిలుస్తుండడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో అతని పాత్ర కూడా ఇలానే ఉండబోతుందని ఈ లుక్‌ ద్వారా చిత్రయూనిట్‌ ఓ హింట్‌ ఇచ్చారు. కాగా ఈ పోస్టర్‌లో నారా రోహిత్‌ చేతికి కట్టుతో కనిపించాడు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందించగా.. ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహిస్తున్నారు.