వెంకీ చైతుల “వెంకీమామ”?

విక్టరీ హీరో వేంకటేశ్‌ ఇప్పుడు వరుసగా రెండు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు సిద్ధమై టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాడు. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఎఫ్‌ 2 చిత్రంలో వరుణ్‌తేజ్‌తో, మరోవైపు పవర్‌ ఫేమ్‌ బాబీ (కె. యస్‌. రవీంద్ర) డైరెక్షన్‌లో మేనల్లుడు నాగచైతన్యతో కలిసి మరో ప్రాజెక్టులో నటించబోతున్నాడు. చైతూ చేయబోతున్న చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో వెంకీ, చైతూలు మామ అల్లుళ్లుగా నటిస్తుండటంతో ‘వెంకీ మామ’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారంట. పూర్తిగా విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ చిత్రం ఉండబోతుందని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా బాబీ రూపొందించబోతున్నాడని సమాచారం. అందుకే టైటిల్‌ అదే అయితే బాగుంటుందన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే వివరణ వచ్చే అవకాశముంది. ఈ సినిమాలో వెంకీకి జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ హుమా ఖురేషీ, చైతూకు జోడిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు వెంకీ-వరుణ్‌ తేజ్‌ల ఎఫ్‌ 2 ఈ నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.