వెంకీ, చైతూల మల్టీస్టారర్‌ ప్రారంభమైంది

టాలీవుడ్‌ హీరోలు వెంకటేష్‌, నాగార్జునలు మల్టీస్టారర్‌ మూవీల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం బయోపిక్‌, మల్టీస్టారర్‌ చిత్రాల హావా నడుస్తోంది. వేంకటేష్‌.. వరుణ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ఈ మథ్యనే ప్రారంభమైంది. తాజాగా వెంకటేష్‌ నాగ చైతన్య కలిసి చేస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ఈ రోజు(బుధవారం) రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో అంగరంగవైభవంగా ప్రారంభమైంది. కాగా ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్‌ పరిశీలినలో ఉంది

 

బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన బాబి ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.