వెంకీ దర్శకత్వంలో నితిన్ సినిమా

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ శిష్యుడు వెంకీ తన తదుపరి చిత్రం నితిన్‌తో చేయనున్నాడు..యంగ్‌ హీరో నాగ శౌర్యతో ‘చలో’ మూవీతో టాలీవుడ్‌ దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల ఈ మూవీ హిట్‌ తర్వాత అతడికి అవకాశాలు క్యూ కడుతున్నాయి..అయితే ఇప్పటికే స్టోరీ లైన్‌ను నితిన్‌కు వినిపించగా కథ నచ్చడంతో ఒకే చెప్పాడు..

ప్రస్తుతం ఫైనల్‌ స్ర్కిప్ట్‌ పనిలో పడ్డాడు వెంకీ.. నితిన్‌ ప్రస్తుతం దిల్‌రాజు నిర్మిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కబోతుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన వెంటనే వెంకీ కుడుముల సినిమాలో నటించనున్నాడు నితిన్‌.