వెడ్డింగ్‌ పై మండిపడ్డ నిహారిక

నిహారిక కొణిదెలను వెడ్డింగ్‌ గురించి ప్రశ్నిస్తే మీడియా పై మండిపడింది. అసలు ఎవరయ్యా వీళ్లను లోపలికి రానిచ్చింది? ‘నా పెళ్లి గురించి మీకెందుకయ్యా! నిహారిక ఎప్పుడు చేసుకుంటుంది? ఎక్కడ చేసుకుంటుంది? ఎందుకు చేసుకుంటుంది? చూస్తే షాకవుతారు! షేకవుతారు! కింద పడి లేస్తారు! పిచ్చా! మీకేమైనా. మీ స్కోరింగ్‌ కోసం నా పేరును వాడుకుంటారా?’ అంటూ విరుచుకుపాడ్డారు. అయితే ఆ ఛానల్‌ వాళ్ళు మేము అడిగేది మీ వెడ్డింగ్‌ గురించి కాదు ‌.. ‘హ్యాపి వెడ్డింగ్‌’ మూవీ గురించి మేడమ్‌! అనే చెప్పే సరికి. సారీ చెబుతూ ‘హ్యాపి వెడ్డింగ్ ట్రైలర్‌ ఈ నెలఖరున విడుదలవుతుంది. సినిమా విడుదల ఎప్పుడో ఆరోజు చెప్తాం’ అంటూ సమాధానమిచ్చారు. గురువారం ‘హ్యాపి వెడ్డింగ్‌’ ప్రమోషనల్‌ వీడియోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా వీడియోలో పైవిధంగా నిహారిక స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో ఆకట్టుకుంటోంది.

‘హ్యాపి వెడ్డింగ్’ చిత్రంలో సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల హీరోహీరోయిన్‌గా నటిస్తున్నారు . సుమంత్ అశ్విన్‌, నిహారిక తమ పాత్ర‌ల్లో చాలా చ‌క్క‌గా ఒదిగిపోయారని తెలిపారు. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కుర్ర‌కారుని విప‌రీతంగా ఆకట్టుకుంటాయని దర్శకుడు లక్ష్మణ్‌ వెల్లడించారు. యూవీ క్రియేష‌న్స్ సంస్థ ఈ చిత్రాని నిర్మిస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జూన్‌ 21న విడుదల చేయగా, ఈనెల 30న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.