వెయ్యి ముక్కలైన నా మనసును.. రేణూదేశాయ్‌

తనకు కాబోయే భర్త గురించి కవిత రూపంలో ఓ పోస్ట్ పెట్టారు రేణూ దేశాయ్. పేరు వివరాలు బయట పెట్టడం ఇష్టంలేక తనకు కాబోయే భర్తనుద్దేశించి తన ప్రేమనంతా తన కవిత రూపంలో వెల్లడించారు. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తనకు కాబోయే భర్త గురించి వివరిస్తూ…
“వెయ్యి ముక్కలైన నా మనసును..
ఓపిగ్గా ఒక్కటి చేశావు
ఒక్కో ముక్క నేను పడిన బాధకు సాక్ష్యం..
నీ సున్నితమైన వైఖరి..
సుతిమెత్తని మాటలతో నా బాధలను పోగొట్టావు
నా ఆత్మకు ప్రశాంతతను కలిగించావు.
ఇక ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు
ఎందుకంటే నువ్వు నాకు ఉన్నావు” అంటూ తనకు కాబోయే భర్తపై ప్రేమను వెల్లడించారు.