వేశ్య పాత్రకు ఓకే చెప్పిన హీరోయిన్!

ఒకప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది నటి సదా. తరువాత తెలుగులో కొత్త హీరోయిన్ల హవా పెరగడంతో క్రమంగా సదాకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ప్రస్తుతం ఆమె కొన్ని టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు అబ్ధుల్ మాజిద్ సెక్స్ వర్కర్ల జీవితం ఆధారంగా ‘టార్చ్ లైట్’ అనే సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో సెక్స్ వర్కర్ గా సదా కనిపించనుందని సమాచారం.
ఈ సినిమాలో సదాతో పాటు రిత్విక అనే మరో నటి కూడా వేశ్య పాత్రలో నటించనుంది. వేశ్యగా నటించడానికి చాలా మంది హీరోయిన్లు అంగీకరించలేదట. కానీ సదా మాత్రం ఈ పాత్రకు అంగీకరించడమే కాకుండా బాగా నటించిందని దర్శకుడు చెప్పుకొచ్చాడు.