‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ ట్రైలర్‌

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ విజయ్‌ ఏలకంటి దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సామ్రాట్‌ రెడ్డి, ప్రియాదర్శి, ఆదర్శ్‌ బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. రఘ దీక్షిత్‌ సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

‘సమాజాన్ని, ప్రజల్ని ఎదుర్కొంటూ న్యాయం కోసం దీక్ష చేసే ప్రయాణం. త్వరలోనే సినిమా విడుదల కాబోతోంది. థియేటర్లకు వెళ్లి ఆమె కథను చూడండి’ అని మంచు లక్ష్మి ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. ట్రైలర్‌లో తన భర్తను హత్య చేసిన వ్యక్తి కోసం గాలిస్తూ కనిపించారు. పోలీసుస్టేషన్‌ చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ పోలీస్‌ అధికారి..’నీ మొగుడ్ని చంపిన వాడి గురించి ఏదేదో విచారణ చేస్తున్నావట.. అంటే పోలీసుల కన్నా నువ్వు బాగా చేస్తావా?’ అంటూ ప్రశ్నిస్తూ కనిపించారు. ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ట్రైలర్‌ను రూపొందించారు. ఈ చిత్రం విడుదలకు ముందే ఒట్టావా ఇండియన్‌ ఫిలిం ఫెస్టివకు ఎంపికైన సంగతి తెలిసిందే.