వైరల్‌గా మారిన మహేశ్ బాబు మైనపు విగ్రహం

మేడమ్‌ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక మ్యూజియంలో తమ అభిమాన హీరో విగ్రహం ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. నిర్మాణంలో ఉన్న మహేశ్‌ మైనపు విగ్రహానికి సంబంధించిన ఫొటో విడుదల అయింది. కొద్ది గంటల్లోనే ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ శిల్పి ఇవాన్‌ రీస్‌ మహేశ్‌ విగ్రహాన్ని తయారుచేస్తున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటుంది.

భారత్‌ నుంచి కొద్ది మంది హీరోలు మాత్రమే ఈ ఘనత దక్కించుకున్నారు. తెలుగులో ఈ గౌరవం అందున్న రెండో హీరోగా మహేశ్‌ నిలిచారు. అంతకు ముందు ప్రభాస్‌ విగ్రహాన్ని ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అతి త్వరలోనే మహేశ్‌ మైనపు విగ్రహం మ్యూజియంలో కొలువుదీరనుంది. కాగా, ప్రస్తుతం మహేశ్.. వంశీ పైడిపల్లి‌ చిత్రంలో నటిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates