వైరల్ గా మారిన నాగార్జున డిఫరెంట్ లుక్

సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫొటోలో నాగార్జున డిఫరెంట్ లుక్ తో కనిపించాడు. ఈ చిత్రంలో నాగార్జున పల్లుటూరి గెటప్‌లో కనిపించాడు. భుజాలపై టవల్ వేసుకుని..కళ్లజోడు పెట్టుకుని..తెల్లటి గడ్డంతో ఓ ఫోటొ దిగాడు నాగార్జున. పక్కన ఓ అమ్మాయితో కలిసి ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు. అయితే నాగార్జున వేసిన ఈగెటప్ ఏ సినిమలోనిది మాత్రం ప్రేక్షకులకు అంతుపట్టని విషయం.

ప్రస్తుతం నాగార్జున ఓ మల్టిస్టారర్ సినిమాలో చేస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈమూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ చిత్రంలో నాగార్జునతో పాటు న్యాచురల్ స్టార్ నాని కూడా నటిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈపిక్ మాత్రం అందరూ దేవదాస్ చిత్రం లోనిదే అనుకుంటున్నారు.