వోగ్ మ్యాగజైన్ పై షారుఖ్ ఖాన్ కూతురు

సినీ ఇండస్ర్టీలో స్టార్‌ హీరోల కొడుకులు సినిమాల్లోకి రావడం అనాదిగా వస్తున్న ఆనవాయితే. ఇప్పడు స్టార్స్‌ కూతుర్లు కూడా సినిమాల్లోకి వస్తున్నారు. హీరోల పోటీని తట్టుకొని నిలబడి తమకంటూ సొంతంగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. అందుకు ఉదాహరణ సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్, రీసెంట్ గా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ ధడక్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు దూసుకుపోతున్నది.

తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వోగ్ అనే ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. ఒక మోడల్ కు ఉండాల్సిన లక్షణాలన్ని సుహానా ఖాన్ లో ఉన్నాయి. అలాగే బాలీవుడ్ హీరోయిన్ కావడానికి అన్ని అర్హతలు సుహానా ఖాన్ లో స్పష్టంగా ఉన్నాయి. ఏమాత్రం ఇబ్బంది పడకుండా, కెమెరా ముందు బెణుకులేకుండా ఫోటోషూట్ లో పాల్గొంది. వోగ్ బ్యూటీ అవార్డు 2018 కార్యక్రమంలో సుహానా ఖాన్ కవర్ పేజీ మ్యాగజైన్ ను విడుదల చేశారు. కాగా సుహానా ఖాన్ వోగ్ కవర్ పేజ్ ఫోటో మ్యాగజైన్ ను ఆమె తండ్రి షారుఖ్ ఖాన్ రిలీజ్ చేశాడు.