శంభో శంకర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌

షకలక శంకర్‌ హీరోగా నటించిన చిత్రం ‘శంభో శంకర’. ఈ చిత్రం ద్వారా శ్రీధర్ ఎన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కారుణ్య కథానాయిక. ఆర్.ఆర్.పిక్చర్స్ పతాకంపై ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ… పవన్‌ కల్యాణ్‌ నా దేవుడు…నా దేవుడు చేసే పనులే నేను చేస్తాను. పవన్‌ ఫ్యాన్స్‌ లో రూపాయిలో ఒక పావల శాతం మంది చూసిన నా సినిమా హిట్‌ అయిపోతుంది. పావల శాతం మంది చూసిన మా నిర్మాతకు 60 కోట్లు వచ్చేస్తాయి. నిర్మాత నాకు లాభాలు ఏమీ అక్కర్లేదు.. నా డబ్బు నాకు వస్తే చాలు. వచ్చిన లాభలు మీరు డైరెక్టర్‌ పంచుకోండి అంటున్నారు.

పవన్ ఫ్యాన్స్‌ పై మాకు నమ్మకం భాయ్య ..నాకు ఇల్లు లేదు భయ్య ఇన్నీ సినిమాల్లో చేసిన శంకర్‌కు ఇల్లు లేదు భయ్యా అంటూ వాఖ్యనించాడు. నేను10 రూపాయిలు సంపాదిస్తే 8 రూ ఇచ్చేస్తాను. మా ఇంట్లో అందరూ 10 సంపాదించి 8 రూ ఇచ్చేస్తే 2 రూ..తో అడుకుతింటావా..అంటారు అయినా నేను పట్టించుకోను. ఎందుకుంటే నేను పవన్‌ కల్యాణ్ ఫాలోవర్‌ ని. మీడియా సభ్యులందరు ఈ విషయాన్ని కవర్‌ చేయండి అన్నారు. పవన్‌ ఫ్యాన్స్‌ తో పాటు..మహేష్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, బన్నీ ఫాన్స్‌ అందరు ఈ సినిమా తప్పకుండా చుడండి. అందుకంటే నేను అందరి వాడ్ని మీ అందరికీ ఇష్టమైనవాడని అన్నాడు.