‘శంభో శంకర’ మూవీ రివ్యూ

movie-poster
Release Date
June 29, 2018

సినిమా : శంభో శంకర
నటీనటులు : షకలక శంకర్‌, కారుణ్య చౌదరి, నాగినీడు తదితరులు
దర్శకత్వం : ఎన్‌. శ్రీధర్‌
నిర్మాతలు : రమణా రెడ్డి, సురేశ్‌ కొండేటి
సంగీతం : సాయి కార్తీక్‌

‘జబర్దస్త్‌’ షోతో పరిచయమై ‌’రాజుగారి గది’, ‘ఆనందోబ్రహ్మ’ తదితర చిత్రాల్లో కమెడియన్‌గా మెప్పించాడు షకలక శంకర్‌. సినీ ఇండస్ట్రీలో కమెడియన్‌ నుండి హీరోగా తెరగేట్రం చేసినవారు చాలామందే ఉన్నారు. తాజాగా అదే కోవలోకి శంకర్‌ చేరాడు. ‘శంభో శంకర’ చిత్రంతో తొలిసారి హీరోగా నటించాడు శంకర్‌. అంతేకాదు ఈ సినిమాకు తాను సహాయ దర్శకుడిగానూ వ్యవహరించానని ఒకానొక సందర్భంలో వెల్లడించాడు. మరి తొలిసారి హీరోగా చేసిన శంకర్ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్‌ సాధించగలిగాడో చూద్దాం..

కథ: అంకాలమ్మ పల్లె గ్రామంలో జరిగే కథ ఇది. ఆ ఊరి ప్రెసిడెంట్‌ అజయ్‌ ఘోష్‌. ప్రెసిడెంట్‌కు తోడుగా ఓ అవినీతి పోలీసాఫీసర్‌. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ ఊరి ప్రజలకు అండగా ఉంటాడు హీరో శంకర్ (షకలక శంకర్)‌. ఇక ఈ కథనంలో ఊర్లో శంకర్‌కి ఒక ప్రేయసి పార్వతి (కారుణ్య చౌదరి) ఉంటుంది. ప్రెసిడెంట్‌ కొడుకు మూలంగా చెల్లెల్ని పోగొట్టుకున్న శంకర్‌ ఆ ప్రెసిడెంట్‌ కొడుకును చంపేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ప్రెసిడెంట్‌కు ఎదురు తిరిగిన శంకర్‌ ఊరి ప్రజలకు అండగా నిలబడతాడు. శంకర్‌పై కక్ష గట్టిన ప్రెసిడెంట్‌ అతనికి ఇష్టమైన పోలీస్‌ ఉద్యోగం రాకుండా అడ్డుకుంటాడు. ప్రతీకారంగా శంకర్‌ ఏం చేస్తాడు, ఆ ఊరిని, ప్రజల్ని ప్రెసిడెంట్‌ బారి నుంచి ఎలా కాపాడతాడు? తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడల్సిందే.

నటీనటులు
కమెడియన్‌గా అందరిని నవ్వించే షకలక శంకర్‌కు హీరోగా మారడం కోసం పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తిండిలేక కొంత ఎక్సర్‌సైజ్‌ చేసి,మరికొంత సన్నబడ్డానని చెప్పుకొచ్చాడు శంకర్‌. హీరో స్థాయిలో కాకపోయినా మంచి లుక్‌లో కనిపించాడు. ఈ సినిమా కోసం డ్యాన్సులు, ఫైట్స్‌ విషయంలో బాగానే కష్టపడ్డాడు. డైలాగ్‌ డెలివరీ విషయంలో కూడా పర్వాలేదనిపించాడు. ఇక హీరోయిన్‌గా కారుణ్య చౌదరిది చిన్న పాత్రే. తనకున్న ఏడెనిమిది సన్నివేశాల్లో ప్రేక్షకులకు మెప్పించే ప్రయత్నం చేసింది. ప్రెసిడెంట్‌గా అజయ్‌ఘోష్‌ ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రల్లో రవి, నాగినీడు, హీరో స్నేహితులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ
పవన్‌ ఇమేజ్‌ను వాడుకొని జబర్దస్త్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న శంకర్‌ వెండితెర మీద కూడా అదే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో హాస్యనటుడిగా ముద్ర సంపాదించుకున్నాడు. అదే సమయంలో హీరోగా తన సత్తా నిరూపించుకోవాలని ప్రయత్నం చేశాడు. అయితే సినిమా చూస్తే కథలో అంత బలం కనిపించలేదనిపిస్తుంది. శంకర్‌ బాడీలాంగ్వెజ్‌కు సెట్‌ కాలేదు. ఓ కమెడీయన్‌తో హీరోగా సినిమా తీయాలనుకున్నప్పుడు.. కామెడీ కథ అయినా ఉండాలి.. లేదా కథా బలం అయినా స్ట్రాంగ్‌గా ఉండాలి. ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో కథనం ఉండాలి. దర్శకుడు శ్రీధర్ మాత్రం శంకర్‌తో మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ చేయాలనుకున్నాడు. కానీ శంకర్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ అంచనా ఉంటుంది. సరదాగా కాసేపు హాయిగా నవ్వుకుందామని అనుకుంటారు. పల్లెటూరు, అక్కడ ప్రెసిడెంట్ దౌర్జన్యాలు, రైతుల కష్టాలు ఇవన్నీ పాత కథనాలే. కామెడీగా అందరినీ నవ్వించే శంకర్ సీరియస్‌గా డైలాగ్స్ చెబుతుంటే ప్రేక్షకుడికి అంతగా కనెక్ట్ కాదు. చాలా సన్నివేశాల్లో గతంలో వచ్చిన సినిమా ఛాయలు కనిపిస్తాయి. కొన్ని మాస్‌ డైలాగ్‌లు పర్వాలేదనిపించినా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ సీన్స్‌ మరీ సిల్లీగా అనిపిస్తాయి. పాటలు వినడానికి పరవాలేదు గానీ తెరకెక్కించడంలో నిరాశపరిచాయి. అయితే ఈసారి ఆ ప్రయత్నం పెద్దగా వర్క్‌ అవుట్ కాలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ పర్వాలేదనిపిస్తాయి.

హైలైట్స్
కొన్ని మాస్ డైలాగ్స్
సంగీతం

డ్రాబ్యాక్స్
కామెడీ లేకపోవడం
కథలో బలం లేకపోవడం

చివరిగా : “హీరోగా మెప్పించలేకపోయిన శంకర్”
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Critics METER

Average Critics Rating: 3
Total Critics:3

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

"హీరోగా మెప్పించలేకపోయిన శంకర్"
Rating: 2/5

https://www.klapboardpost.com

Rating: 2.75/5

https://telugu.filmibeat.com

Rating: 3/5

https://www.tollywood.net