శర్వాతో ఇద్దరు మల్లు హీరోయిన్స్!

వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల ‘మహానుభావుడు’ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు దర్శకుడు సుధీర్ వర్మతో కలిసి ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. కథ ప్రకారం ఈ సినిమాలో శర్వా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా నివేదా థామస్ ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ను వెతికే వేటలో పడ్డారు.

ఫిదా సినిమాతో అందరిని ఫిదా చేసిన సాయి పల్లవిని ఈ సినిమా మరో హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆమె షెడ్యూల్స్ బిజీగా ఉండడం వలన ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఆమె గనుక అంగీకరిస్తే ఈ సినిమాకు మరికొంత క్రేజ్ యాడ్ అవ్వడం ఖాయం. మొత్తానికి ఇద్దరు మల్లు భామలతో రొమాన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు శర్వానంద్. నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.