శర్వానంద్ – దిల్ రాజు ల శతమానం భవతి ప్రారంభం

శర్వానంద్ – దిల్ రాజు ల శతమానం భవతి ప్రారంభం
 
ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా దిల్ రాజు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ లకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సంస్థ నుండి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చినప్పటికీ, బొమ్మరిల్లు చిత్రానికి ఉన్న ప్రత్యేకత వేరు. 
 
” బొమ్మరిల్లు  విడుదల అయి నేటికి  సరిగ్గా పది సంవత్సరాలు అవుతుంది. తండ్రీ కొడుకుల మధ్య ఉండే సంబంధాన్ని అందం గా ప్రతిబింబించిన చిత్రం బొమ్మరిల్లు. ఇప్పుడు సరిగ్గా అదే రోజున, తాతా మనవళ్ల  మధ్య ఉండే బంధాన్ని చూపే “శతమానం భవతి” కి చిత్రానికి శ్రీకారం చుడుతున్నాం. మా బ్యానర్ కి బొమ్మరిల్లు  సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టిందో, ఈ శతమానం భవతి చిత్రం అంతటి పేరు ను తెస్తుంది అని నమ్మకం ఉంది. 
 
శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. వచ్చే సంక్రాంతి కి విడుదల చేసే విధం గా ప్లాన్ చేస్తున్నాం “, అని  దిల్ రాజు తెలిపారు.  
 
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి 2017 కి విడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.  ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి ఎడిటింగ్ మధు , సినిమాటోగ్రఫి సమీర్ రెడ్డి, సంగీతం మిక్కీ జె మేయర్. ఇతర  తారాగణం, మరియు  సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే విడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది. 
CLICK HERE!! For the aha Latest Updates