శర్వా ‘పడి పడి లేచే మనసు’!

కొత్త సినిమాలకు పాత హిట్ సినిమాల్లోని పాటల నుంచి లైన్స్ తీసుకుని టైటిల్ గా పెట్టడం కొత్తేమీ కాదు. తాజాగా శర్వానంద్ చిత్రానికి సైతం చిరంజీవి హిట్ చిత్రం లంకేశ్వరుడులోని ఓ సాంగ్ ని తీసుకుని టైటిల్ గా పెట్టారు. శర్వానంద్ హీరోగా, రాఘవపూడి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రూపొందుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం నేపాల్ లో ఉండబోతోందని సమాచారం.
శర్వా కు జంటగా సాయిపల్లవి నటిస్తుండగా..ఈ చిత్రం కోసం ‘పడిపడి లేచే మనసు’ అనే టైటిల్ని ఫైనల్ చేసి ఫస్ట్ లుక్ వదిలారు. ఓ హిల్ స్టేషన్ లో ఓ ఉదయం వేళ మంచుకురుస్తుండగా కప్పులో టీ తాగుతున్న శర్వా లుక్ లుక్ అదిరిపోయిందంటున్నారు అభిమానులు. ఈ స్టిల్ లో హ్యాండ్సమ్ గా ఉండటంతో కాస్త రఫ్ గడ్డంతో కొంచెం కొత్తగా కనిపించటంతో ఆకట్టుకుంటోంది. గతేడాది ‘శతమానం భవతి’, ‘మహానుభావుడు’తో హిట్స్‌ అందుకున్న సంగతి తెలిసిందే.