శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి గ్రాఫ్ ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ?

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే..  శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి. ప్రస్తుతం ప్రజల్లో శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి అలియాస్ సింగారెడ్డి గారి రవిచంద్ర కిశోర్ రెడ్డి ఉమ్మడి కర్నూల్ జిల్లా నంద్యాల పట్టణంలో సంపన్న వ్యాపార రాజకీయ కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రవిచంద్ర గారు ఢిల్లీ లోని ఐ.ఐ.పి.యం కళాశాలలో మార్కెటింగ్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేశారు. రవిచంద్ర రాజకీయాల్లోకి రాకముందు తమ కుటుంబానికి చెందిన పలు వ్యాపారాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించేవారు.

రవిచంద్ర కుటుంబ నేపథ్యంలోకి వెళ్తే.. ఆయన తండ్రి శిల్పా మోహన్ రెడ్డి మాజీ మంత్రి , బాబాయ్ శిల్పా చక్రపాణి రెడ్డి ప్రస్తుతం శ్రీశైలం
ఎమ్మెల్యే గా వ్యవహారిస్తున్నారు. రవిచంద్ర తండ్రి , బాబాయి స్పూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించి తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో తండ్రితో కలిసి చేరారు. అయితే,  మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకొని 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నుండి  ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది.
రవిచంద్ర కుటుంబం రాజకీయాలతో పాటు వ్యాపార, సామాజిక సేవలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. శిల్పా సహాకర్ సంస్థ కింద నంద్యాల, శ్రీశైలం, పాణ్యం నియోజకవర్గాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతకీ, రాజకీయ నాయకుడిగా శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి ఉందా ?, చూద్దాం రండి. 
 

శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి కు వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్నప్పటికీ  ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఆయన అనుచరులు నంద్యాల ప్రాంతంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.  భూ కబ్జాలు, పలు అవినీతి వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని పలు వ్యాపారాలను బ్లాక్ మెయిల్ చేసి.. వారి నుంచి డబ్బు వసూళ్లు చేస్తున్నట్లు కూడా  ప్రజల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది.  మొత్తమ్మీద  శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి కుటుంబం ఈరోజు రాజకీయాల్లో ఒక ప్రముఖ కుటుంబంగా గుర్తింపు సాధించింది. 

 
కానీ, ఆ గుర్తింపు ను, పేరును  శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి నిలబెట్టేలా లేరు అని టాక్.  ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత  శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి చుట్టూ పలు భూ వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ప్రజల్లో  శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం కూడా ఏమీ బాగాలేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో  శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి గెలవడం కష్టమే.
CLICK HERE!! For the aha Latest Updates