శివాజీ రాజా కొడుకు హీరోగా ‘ఏదైనా జ‌ర‌గొచ్చు’

ప్రముఖ నటుడు, మా అధ్యక్షుడు శివాజీ రాజా కుమారుడు విజయ్‌ రాజా హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. కె. రమాకాంత్‌ దర్శకత్వంలో విజయ్‌ రాజా హీరోగా తొలి ‘ఏదైనా జ‌ర‌గొచ్చు’సినిమా తెరకెక్కుతోంది. వెట్‌ బ్రెయిన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ముహూర్తపు షాట్‌కు క్లాప్‌ ఇవ్వగా రవిరాజా పినిశెట్టి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. హరీష్‌ శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి బ్రదర్స్‌, ఎస్‌వీ కృష్ణారెడ్డి, కె. అచ్చిరెడ్డి, హీరో శ్రీకాంత్‌, తరుణ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ….నన్ను 32 ఏళ్లుగా నటుడుగా ఆదరిస్తున్నారు. అదే ఆదరణ , ప్రేమ మా అబ్బాయి విజయ్‌ రాజాకు కూడా అందించాలని కోరుకుంటున్నా. ఈ చిత్ర దర్శకుడు రమాకాంత్‌ మాట్లాడుతూ.. చంద్రశేఖర్‌ ఏలేటి గారి వద్ద దర్వకత్వ శాఖలో పని చేశాను. ఆ అనుభవంతోనే ఈ చిత్రానికి డైరక్షన్‌ చేస్తున్నా. హర్రర్‌ జానర్‌లో సాగే కామెడీ థ్రిల్లర్‌ చిత్రమిది అన్నారు. హీరో విజయ్‌ రాజా..నేను హీరో అవడానికి అమ్మా నాన్నల సపోర్ట్‌ మావయ్య సపోర్ట్‌ ఎంతో ఉంది అన్నాడు. కాగా ఈ చిత్రానికి సంగీతం శ్రీకాంత్‌ పెండ్యాల అందిస్తున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates