‘శుభలేఖ+లు’ ట్రీజర్‌

కొత్త ఆలోచనలతో తెరకెక్కుతున్న చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో డిఫరెంట్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ‘శుభలేఖ+లు’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శరత్‌ నర్వాడే దర్శకుడు. ఈ చిత్రంలో నూతన నటి ప్రియా వడ్లమాని, శ్రీనివాస్‌ సాయి, దీక్ష శర్మా రైనా, వంశీ రాజ్‌, మోనా బెద్రే ప్రదాన పాత్రలలో నటిస్తున్నారు. కాగా ప్రియా..నిత్య పాత్రలో పరిచయం చేస్తూ ఓ ఆసక్తికర టీజర్‌ను రిలీజ్ చేశారు.

నిత్య పాత్రను మోడ్రన్ అమ్మాయిగా పరిచయం చేశారు. పెళ్లి వేడుకకు సిద్ధమవుతున్న అమ్మాయి సిగరెట్ తాగుతూ కనిపించటం చూస్తే కథా కథనాలు బోల్డ్‌గా ఉండబోతున్నాయని అర్ధమవుతోంది. హనుమ తెలుగు మూవీస్ బ్యానర్‌ పై విద్యా సాగర్‌, ఆర్‌ ఆర్‌ జనార్థన్‌ లు నిర్మిస్తున్న ఈ సినిమాకు కే ఎమ్‌ రాథాకృష్ణన్‌ సంగీతమందిస్తున్నారు