“శుభలేఖ+లు” మరో టీజర్

వెయ్యి అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలని పెద్దలంటారు. కానీ పెళ్లా అది ఔట్ డేటెడ్ కాన్సెప్ట్. పెళ్లి పేరుతో అన్నేళ్లు ఒకరితోనే కలిసి ఉండటమా.. సింగిల్‌గా ఉండాలి అదే బెస్ట్ అంటూ ఓ సినిమా రూపొందిస్తున్నారు. శరత్ నర్వాడే దర్శకత్వంలో “శుభలేఖ+లు” అనే సినిమా తెరకెక్కుతోంది. శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమణి, దీక్షాశర్మ, వంశీరాజ్, మోనా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఇంట్రస్టింగ్ టీజర్‌లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ మరో డిఫరెంట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇదివరకే ఒకసారి ప్రధాన పాత్రదారులను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్‌లకు మంచి స్పందన వచ్చింది. పెళ్లి గురించి ఓ మోడ్రన్‌ అమ్మాయి అభిప్రాయాన్ని టీజర్‌ రూపంలో రిలీజ్ చేశారు. తాజాగా అదే బాటలో మరో టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. హనుమ తెలుగు మూవీస్ బ్యానర్‌ పై విద్యా సాగర్‌, ఆర్‌ ఆర్‌ జనార్థన్‌లు సంయుక్తంగా నిర్మిస్తుండగా కేఎమ్‌ రాథాకృష్ణన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈషా రెబ్బ విడుదల చేసింది. ఈ సినిమా ద్వారా శ్వేత వర్మ.. శ్వేత ప్రసాద్‌గా పరిచయం కాబోతుంది. వన్స్ యు మ్యారీడ్.. యు లూజ్ ఎవిరిథింగ్.. అందుకే థింక్ బేబీ.. ఒకసారి ఆలోచించు అంటూ శ్వేత డైలాగ్‌ను టీజర్‌గా విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ చూస్తుంటే “డోన్ట్ మ్యారీ.. బీ హ్యాపీ” కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నట్లు అనిపిస్తుంది.