శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు : పవన్‌

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సాధారణగా తనకు పుట్టినరోజు వేడుకలు జరిపే అలవాటు లేదని, అయితే తనపై అభిమానంతో రెండు రాష్ట్రాల్లో అభిమానులు, జనసేన కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలు నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు. వేడుకల్లో పాల్గొన్నవారందరీకీ పవన్ ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు చెప్పారు.